- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి
అనకాపల్లి, చైతన్యవారధి :
అనకాపల్లి అసెంబ్లీ నియైజకవర్గ పరధిలో గల ప్రజా సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని అనకాపల్లి అసెంబ్లీ నియైజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ - ఐ.ఆర్.గంగాధర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం విశాఖపట్నంలో జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం అసెంబ్లీ నియైజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగ నియైజకవర్గంలో భూ సమీకరణ పేరుతో జరుగుతున్న ప్రభుత్వ భూ దోపిడీ పై నాయకులు తులసిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తుమ్మపాల షుగరు ఫ్యాక్టరీ సమస్య పై కూడా సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. వైసీపీ పార్టీ పై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని అన్నారు. రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీవేనని జోష్యం చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ మంత్రి సన్యాశిరావు, అనకాపల్లి మండల కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ ఎగ్గాడ భాస్కరరావు, కశింకోట మండల కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ సూరా శ్రీనువాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి సంతోష్ కుమార్, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు కట్టమూరి నూక అప్పారావు, మండల బి.సి. సెల్ కన్వీనర్ టేకుపూడి సంతోష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మలపురెడ్డి కోటేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
అనకాపల్లి, చైతన్యవారధి :
విజయరామరాజుపేట గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి ఆహ్వాన క్రికెట్ పోటీలు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ప్రారంభం అయ్యాయి. వైయస్సార్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలకా రవి, ఆర్గనైజర్ ఉగ్గిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగు క్రికెట్ పోటీలను మరిడిమాంబ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆళ్ల శివరాం సత్యనారాయణ, గ్రామ కమిటీ క్రికెట్ పోటీలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని, ప్రతియేటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా కమిటీ అభినందించింది. ఈ కార్యక్రమంలో విజయ రామరాజుపేట పూర్వపు క్రికెట్ క్రీడాకారులు ఆడారి కుమార స్వామి, ఆళ్ల రామకృష్ణ, ఆళ్ల రామచంద్రరావు, నంబారు రామకృష్ణ, గ్రామ పెద్దలు పిట్ల బుడ్డశ్వరరావు, బొబ్బిలి అప్పారావు ఎల్లంకి సత్తిబాబు, కుండల రామకృష్ణ, అల్లు త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.