శిథిలమైన తుఫాన్ షెల్టర్లో పొంచి ఉన్న ముప్పు
పరవాడ: కలపాక పంచాయతీ పరిధి పెదస్వయంభూవరంలో గల తుఫాన్ రక్షిత భవనం కూల డానికి సిద్ధంగా వుంది. సుమారు 40 ఏళ్ల క్రితం ఈ షెల్ట రను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భవనం శిథిలస్థితిలో వుంది. ఇప్పటికే భవనానికి చెందిన గోడలు పెచ్చులూడిపడుతున్నాయి. అలాగే ఓ పక్క సగం గోడలు కూలిపోయి గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనానికి ఆనుకొని అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఒకొక్క సారి పిల్లలు శిథిల భవనం కిందకు వెళ్లి ఆడుకుంటున్నారు. ఏం ప్రమాదం జరిగినా ప్రాణనష్టం వాటిల్లే అవకాశం పొంచి వుంది. అధికారులు తక్షణమే స్పందించి శిథిల భవ నాన్ని తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఎమ్మెల్యే భగవాన్ గనిశెట్టి అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం
సబ్బవరం: మండల కేంద్రం సాయినగర్ కాలనీకి చెందిన కొత్త పల్లి రామల క్ష్మి ఆచూకి లభ్యమైందని హెచ్ సీ సత్యనారా యణ తెలిపారు. గురువారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ ఆమె ఈనెల 2వ తేదీ ఉదయం పది గంటలకు మండల కేంద్రంలోని మెడికల్ షాపునకు వెళుతున్నాని చెప్పి బయలుదేరింది. అప్పటి నుంచి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె కుమారుడు కొత్త పల్లి ఆగస్వి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె సబ్బవరం నుంచి రాజ మండ్రి వెళ్తుండగా తుని వద్ద పట్టుకుని గురు వారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు హెచ్ సీ సత్వనారాయణ తెలిపారు.
బ్రహ్మకుమారీల ప్రచార కార్యక్రమం
పెందుర్తి: 84వ త్రిమూర్తి శివ జయంతిని పురస్కరించుకుని పురుషోత్తపురం ప్రజాపిత బ్రహ్మకుమారీ వి శ్వ విద్యాలయ కేంద్రం సభ్యులు గురువారం సాయంత్రం ప్రచార కార్యక్రమం చేపట్టారు. పెందుర్తి ఎస్ఇ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర చార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ముక్తి...జీవన విముక్తి పేరిట ప్రారంభించిన ఈ ప్రచార కార్యక్రమాన్ని 20వ తేదీ వరకు పల్లె పల్లెన కొనసాగిస్తామన్నారు. కార్యక్ర మంలో పాల్గొన్న సేవకులకు బ్రహ్మకుమా రీలు జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో ఎంవీపీ కాలనీ కేంద్ర ఇన్ చార్జి బీఎం సత్యవ తి, బి.కె.సౌమ్య, దేవకి పాల్గొన్నారు.
శారదా పీఠాన్ని సందర్శించిన డిప్యూటీ స్పీకర్
పెందుర్తి: చినముషిడివాడలో గల శారదాపీఠాన్ని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గురువారం సందర్శించారు. ఈసందర్భంగా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠా . ధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ పీఠం వార్షికోత్సవాలు ముగిసిన నేపథ్యంలో పీఠాధిపతిని మర్యాదపూర్వ కంగా కలిశానని తెలిపారు. ఆయన వెంట వీఎంఆర్ డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఉన్నారు.
రహదారి విస్తరణ పనులు ప్రారంభం
వేపగుంట: నాలుగు రోడ్ల కూడలి నుంచి లక్ష్మీపురం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ముత్యమాంబ అమ్మవారి ఆలయం దాటే వరకు రహదారిని కొంత మేర విస్తరించనున్నారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం పనులు ప్రారంభమయ్యాయి. వేప గుంట నుంచి లక్ష్మీపురం వైపు వెళ్లే మార్గంలో రహదారి ఇరుగ్గా ఉండడం వల్ల ఇక్కడ ఇక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. దీంతో పాటు చిల్లర వ్యాపారులు రహదారికి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటుచేసుకోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. స్థానికులు ఈ సమస్యను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ దృష్టికి తీసు కురావడంతో ఆయన స్పందించి ఇటీవల వేపగుంట కూడలిని సంద ర్శించి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు జీవీఎంసీ అధికారులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ముత్యమాంబ అమ్మవారి ఆలయం అవతల వర కు రహదారికి ఇరువైపులా చెరో ఐదు అడుగుల మేర విస్తరించడానికి చర్యలు చేపట్టారు. విస్తరించిన భాగంలో పక్కా తారు రోడ్డు నిర్మించ డానికి రూ.20లక్షల నిధులు కేటవాయించారు. అలాగే చిరు వ్యాపా రులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ముత్యమాంబ ఆలయం వద్ద గల డ్రైనేజీపై సిమెంట్ పలకలు వేయడానికి ప్రతి పాదనలు చేశారు. ఈ పనులకు మరో రూ.10లక్షల నిధులు కేటాయిం చారు. ప్రాథమికంగా రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన మట్టి దిబ్బలను పొక్లెయినర్ తో తొలగించే చర్యలు చేపట్టారు.
మూడు రాజధానులకు మద్దతుగా మానవహారం
పెందుర్తి: మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మె ల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో నియోజవర్గంలో గల వైసీపీ శ్రేణులు గురువారం పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఏర్పడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదించారన్నారు. పరిపా లన వికేంద్రీకరణ జరిగితే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ న్నారు. కార్యక్రమంలో వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చినల ప్పలనాయుడు, వైసీపీ మండల కన్వీనర్ నక్క కనకరాజు, బయిలపూ డి భగవాన్ జయరాం, ముమ్మన దేవుడు, ఎల్బీ నాయుడు, కోడిగుడ్ల దేవీసాంబమూర్తి, వేగి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.