నూకాంబిక అమ్మవారి జాతర కోసం విస్తృత ఏర్పాటు
• అనకాపల్లి ఎమ్మెల్యే అమర్‌నాథ్ అధికారులతో సమీక్ష
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర కోసం విస్తృత ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. అమ్మవారి దర్శనానికి విచ్చే సే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త అమా వాస్య జాతర మహోత్సవాలకు సంబంధించి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి జాతర జరిగే నెల రోజుల పాటు ఎటువంటి అసౌకర్యం కల గకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తోటాడ జంక్షన్ జాతీయ రహదారి వద్ద లైటింగ్ తో కూడిన అమ్మవారి కటౌట్ ఏర్పాటు చేయా లన్నారు. రైల్వే స్టేషన్లో అమ్మవారి ఫొటో సదరం నమోదు ఏర్పాటు చేసేందుకు రైల్వే అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. జాతర సంద ర్భంగా ఈ నెల 8, 9వ తేదీల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులతో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. టీడీపీ హయాంలో అంతా గందరగోళమే.. టీడీపీ హయాంలో నూకాంబిక ఆలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లో అవినీతి జరిగిం దని ఎమ్మెల్యే ఆమర్నాథ్ ఆరోపించారు. 2014-19 కాలంలో పాటదారులు చెల్లించాలి న రూ. 58 లక్షలు చెల్లించకపోవడం సరికాద న్నారు. తక్షణమే అటువంటి వారందరిపైనా క్రిమినల్ కేసులు పెట్టించాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లు ఆలయానికి విచ్చేసి, నానా ఆర్బాటం చేశా రని, ఆ సమయంలో ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రగ ల్బాలు పలికి భక్తులను మోసం చేశారని విమ ర్శించారు. ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు దాడి జయవీర్ మాట్లాడుతూ తోటాడ రహదారి జం క్షన్ వద్ద భక్తుల సౌకర్యార్థం అమ్మవారి పాదాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఆలయ సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పార్టీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడు దాడి రత్నాకర్, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకీరామ రాజు, ప్రధాన కార్యదర్శి సూరిసెట్టి రమ "అప్పారావు, యువజన విభాగం రాష్ట్ర కార్యద ర్శి పలకా రవి, యువజన విభాగం పట్టణ శాఖ అధ్యక్షుడు జాజుల రమేశ్, మండల పార్టీ అధ్య క్షుడు గొర్లె సూరిబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్ తదితరులు పాల్గొన్నారు.