ఒక మొక్క నాటండి ఒకరి ప్రాణం పోయండి
యలమంచిలి, చైతన్య వారధి : యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం ఎంపీపీ స్కూల్లో పర్యావరణాన్ని పరిరక్షించే నేపద్యంలో ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థుల చేత పాఠశాల ప్రాంగణంలో తమ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాఠశాలలో ఒక మొక్క నాటి ఒక మొక్కకి ఒక ప్రాణం పోయాలని అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యలమంచిలి జడ్పిటిసి సేనాపతి సంధ్య రాము మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి స్కూల్ ఆదర్శంగా తీసుకోవాలని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన స్కూల్ ప్రధానోపాధ్యాయులు నేతి సత్యనారాయణ, స్కూల్ చైర్మన్ మొల్లేటి ప్రసాద్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు గ్రామ అధ్యక్షులు కరణం రవి, వైఎస్ఆర్సిపి నాయకులు వేసం బంగారు బాబు, యర్రంశెట్టి రమణ, హై స్కూల్ చైర్మన్ డి రమణ, స్కూల్ ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.